Saturday 17 May 2014

ీ ప్రేమ కన్నా 100 రెట్లు నీ క్షేమం ముఖ్యం...!

యదసంద్రమంతా విషాద అలలాయే
కంటి నుంచి చుక్క కన్నీరే రాదు..!
నిను కలిసి సంతోషంగా దూరం అవుతా అనుకున్న.!
కాని ఆ క్షణాన నాకు తెలియదు దాని అంతరార్థం...!
నిజంగా నీవు అన్న మాటలు నా గుండెల్లో సుదుల్లగా  గుచ్చుతున్న ఆ క్షణం లో నిన్ను ప్రేమతో మెప్పించడానికి ప్రయత్నించా...!
కాని నీకు ఏదో జరింగింది అని తెలిసిన క్షణణా నా ప్రాణం పోయింది  అనుకున్న...!  
నా పోయి లేచిన ప్రాణం తో నీక్షేమ సమాచారం కోసం పాటుపడిన ఆ క్షణాలు నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి...!
నీ  ప్రేమను పొంద లేకపోయాను అనే భాద కంటే చివరి క్షణాల్లో నీకు హాని తలపెట్టాను అనే వేదన నన్ను రోధనకు గురిచేస్తుంది ...!
ఏది ఏమైనా నాకు  నీ ప్రేమ కన్నా 100 రెట్లు నీ క్షేమం ముఖ్యం...!
నా కన్నీరు అలలై పారుతున్న...నా ఎద సంద్రమై ఎగిసి పడుతున్న నా ఛాయలు నీకు కనిపించానివ్వను...!
ఇప్పటి వరకు జరిగింది చీకటి కొణంగా పరిగణించి నను మన్నిస్తావని...!
నీ భవిష్యతు అంత విజయ పథం లో కొనసాగాలని మనసారా కోరుకుంటూ...!
ఐ  మిస్ యు... ...@భాద తప్త హృదయం తో.....?

Wednesday 1 January 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

బ్లాగ్ మిత్రులందరికి  నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Wednesday 28 August 2013

నా నమ్మకాన్ని మోసం చేసావ్...!

నువ్వు మోసం చేసావు..అవును నా నమ్మకాన్ని మోసం చేసావ్...!
నీ ప్రేమను నమ్మాను.. కాదు కాదు నిన్ను నమ్మాను...!
నాకు క్యారెక్టర్ లేదు అన్నావ్ కదా...!
నా క్యారెక్టర్ గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా...?
నువ్వు ఏంటో నాకు తెలుసు...కాని నినేంటో సమాజానికి తెలుసు...!
అసలు నేను అనే వాడిని నీ జీవితంలోకి రాకపోతే ఎలా ఉండేది నీ జీవితం...?
మనిషిలో ఒక్కసారే పుడుతుంది ప్రేమ అన్నావ్...?
మరి రెండో సారి పుట్టేదాన్ని ఎం అనాలి... ?మోహాం అనాల....?మోజు అనాల...?
ఆ సమాధానం నాకంటే ఎక్కువ నీకె తెలుసు కదా చెప్పగలవా మరి...?
నా జీవితంలో ఏది జరిగిన ఒక్కసారే...!
అందుకే జరిగిపోయింది ... మిగిలిపోయింది అని నేను అనుకున్న...?
కాని నువ్వు ఎం చేసావ్ నీ మోహాం నీ మోజు గురించి చెపుతూ నన్నుమానసికంగా వేదించే ప్రయత్నం చేశావు ...!
ఇప్పుడు చెప్పు ఎవరి క్యారెక్టర్ ఏంటో...?
నాలో ఉన్న ఆర్దత .. ఆవేదన కాదు ఇది... నీ మీద ఉన్న ఆవేశం.. ఆక్రోశం...ఆక్రందన...!
నీను నీల దిగజారి ప్రవర్తించవచ్చు కాని నాకు ఆ ఖర్మ పట్ట లేదు..?
ఇప్పటికైనా మారు లేకపోతే నీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది...!
-సన్నీ జర్నలిస్ట్..."

ప్రొ.జయశంకర్ సార్ కు... జనార్ధన్ సార్ కు అంకితం..."


పది జిల్లాల తెలంగాణా మీ కోసం ఎదురుచూస్తున్నది...!
నేను రాకుండానే వెళ్ళిపోయార అని ధుఖ్హా పడుతున్నది...!
మన స్వప్నం నెరవేరబోతున్నది...!
1000 మంది విద్యార్థి అమరుల ఆత్మలకు శాంతి కలిగే రోజు ఇది...!
మన ధ్యేయం, మన లక్ష్యం, మన ఆశ, ఆశయం నెరవేరే తరుణం ఇది...!
కాని ఎక్కడో వెలితి ఉద్యమ స్పూర్తిని రగిలించి తెలంగాణా ప్రజలకు పోరాటాన్ని అయుదంగా ఇచ్చిన మీరు మా మధ్య లేకపోవడం...!
సువర్ణ తెలంగాణా ప్రొ.జయశంకర్ సార్ కు... జనార్ధన్ సార్ కు అంకితం...!
ఉద్యమ సుర్యుల్లరా అందుకోండి మా ఉద్యమాభి వందనాలు...!
-సన్నీ జర్నలిస్ట్

అమరులకు అంకిత...'



 

కల నెరవేరింది...ఆశయం సిద్దించింది..1000
మంది విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరింది... నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ఢిల్లీ దిగి వచ్చింది.... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది... అమరుల ఆశయాల సాక్షిగా జయ శంకర్ సార్ స్పూర్తిగా ఏర్పడుతున్న ఈ తెలంగాణ అమరులకు అంకితమిస్తూ తెలంగాణా ప్రజానికానికి శుభాకాంక్షలు..."

జై తెలంగాణా జైజై తెలంగాణా 
-సన్నీ జర్నలిస్ట్

నీ జ్ఞాపకాలు ..."

ప్రతి నిమిషం నీ మధుర జ్ఞాపకాలతో నలిగి పోతున్న ...!
నువ్వు పంచిన అనుభూతులను ఆస్వాదిస్తున్న....!
నీ కళ్ళ జోడు లో కనిపించే ప్రతిబింబం లో నన్ను నేను నిందిన్చుకుంటున్న....!
నీ ప్రేమ లో మాధుర్యాన్ని అనుభవించాను మమకారాన్ని చవి చూసాను...!
కాని ఇప్పుడు నువ్వు దూరం అయ్యాక ఆ స్మృతులే విషం ల కనిపిస్తున్నాయి...! 
నా కొమ్మను నైనే నరికేసా అని మధన పడుతున్న....!
ఈ ఆవేదనకు..ఈ ఆలోచలనలకు సమాధానం దొరికేదెన్నడు...!
ఈ వేదన నాకు ఎన్నాళ్ళు....?
సన్నీ....!

నీ జ్ఞాపకాలు..."

నువ్వు నన్ను వదిలేసినా నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను ప్రతి నిత్యం వేదిస్తున్నాయి...!
నీ ప్రేమ లో పొందిన మాధుర్యం మరెక్కడా దొరకదు అనిపిస్తుంది...!
నువ్వు నన్ను వదిలి వెళ్ళిన ఎందుకో ఆ విషయాన్ని ఇప్పటికి నమ్మలేక పోతున్న...!
నా మదిలో నువ్వు కట్టిన కోవెల పూజలు లేక వెల వెల పోతుంది...!
ఒక్కసారి ప్రత్యేక్షమై నేను ఉన్న అని నిరూపించు...!
సన్నీ...!